Wednesday, 24 February 2016


లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి.

డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి.

“యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను.

“ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.


యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః 
అన్ని జీవులలోనూ బుద్ధిరూపంలో కొలువు ఉండే తల్లి లక్ష్మీ దేవికి (శుద్ధ ఙ్ఞాన ప్రతిపాదితమైన విద్యను ప్రసాదించే తల్లి విద్యాలక్ష్మీ) అనేకనేక నమస్కారాలు.


ఈ చరాచర జగత్తులోని అన్ని జీవులలో , బుద్ధిరూపంలో కొలువు ఉండే తల్లి లక్ష్మీ దేవి. ఆ తల్లినే విద్యా లక్ష్మి గా కొలుస్తాము. " విద్య " అనగానే మనకళ్ళముందు వాగ్దేవి సరస్వతి మాత ప్రత్యక్షం అవ్వడం అనేది సహజం. శుద్ధ ఙ్ఞాన ప్రతిపాదితమైన విద్యను ప్రసాదించే తల్లి సరస్వతి దేవి. ఆమే అనుగ్రహం ఉన్నవాళ్ళు మహావిద్వాంసూలుగా , ఙ్ఞానులుగా ప్రసిద్ధికెక్కుతారు.

విద్యాలక్ష్మీ అనుగ్రహం ఉన్నవారికి, విద్యా సంపదతో పాటు, ఐశ్వర్య సంపద కుడా కలుగుతుంది.

శ్రీ మహాలక్ష్మి దేవి సప్తమ అంశ అవతారమైన ఈ విద్యాలక్ష్మీని పూజించినవారు త్వరిత గతిన ఉన్నతస్థాయికి చేరుకుంటారు.

జన్మలన్నిటిలోను మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఎందుకంటే,జీవులలో మనిషికి మాత్రమే వివేకం, మంచి చెడులను గుర్తించే శక్తి, బుద్ధి కుశలతలను ఆ పరాశక్తి వరాలుగా అనుగ్రహించింది.

"విద్యలేనివాడు వింత పశువు" అని అంటారు. ఇలాగ విద్యావంతుడైన వ్యక్తిని అందరూ గౌరవించాలంటే ' వినయం' అనే లక్షణం చాలా ముఖ్యం.
"విద్యా వినయ సంపన్నే " అన్నారు పెద్దలు. వినయం లేని అహంకారి, ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ, ఎవరు గౌరవించరు.

శ్రీ విద్యాలక్ష్మి అనుగ్రహం ఉన్నవారికి వినయ సంపద కుడా అమ్మవారే వరముగా ఇస్తుంది .

విద్యా ప్రతిభ ,వినయం,మృదు సంభాషణ కలిగిన వారికి సమస్త సంపదలు అప్రయత్నముగ లభిస్తాయి.

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి శాంతి సమావృత హాసముఖే
నవ విధి దాయిని కలిమలహారిణి కామ్యఫలప్రద హాసయుతే
జయ జయహే మధుసూధన కామిని శ్రీ విద్యా లక్ష్మీ జయ పాలయమాం

No comments:

Post a Comment