అమ్మా శ్రీహరి రాణి , మా ఇంటికి రావే పూబొణి
ఇష్టముగా నిన్ను కొలుతుము తల్లీ అష్ట లక్ష్మివై రావమ్మా !!అమ్మా !!
1. అందమైన సింహాసనము అమర్చి నీకై ఉంచితిమి
ఆదరముతో మము బ్రోవగ రావే ఆదిలక్ష్మీ దేవీ !!అమ్మా !!
2. నవవిధంబుల పిండివంటలతో నైవేద్యంబులు చేసెదము
దయతో మమ్ముకావగ రావే ధాన్యలక్ష్మీ దేవీ !!అమ్మా !!
3. జాజీ , రోజా , మరువము , మల్లెలు నీ పూజకై తెచ్చితిమి
ఇరుపార్శ్వంబుల గజములతోడ గజలక్ష్మీ నీవు రావే !!అమ్మా !!

4. అంతటా నీవే ఉన్నావని నిన్నారాధించితినమ్మా
అడుగడుగున మాకభయమీయగా ధైర్యలక్ష్మీ రావే !!అమ్మా !!
5. ఉల్లాసమ్ముతో ఉరకలు వేసే నూత్న దంపతులందరికీ
పిల్లాపాపల వారికీయగా సంతానలక్ష్మీ రావే !!అమ్మా !!
6. కర్మజీవులమైన మమ్ము కనికరమ్ముతో కాపాడి
జయోస్తు! మీకని దీవెనలీయగ విజయలక్ష్మీ రావే !!అమ్మా !!
6. కర్మజీవులమైన మమ్ము కనికరమ్ముతో కాపాడి
జయోస్తు! మీకని దీవెనలీయగ విజయలక్ష్మీ రావే !!అమ్మా !!
7. ఘుమఘుమలాడే అత్తరు పన్నీరు అమ్మా నీకై దాచితిమి
ఘల్లుఘల్లుమని గజ్జెలు కదల ధనలక్ష్మీ నీవు రావే !!అమ్మా !!
8. పర్తిపురీలో వెలసిన పరమ పావనుడు మన బాబా
పాపాలను ప్రక్షాళన చేయగ సాయిలక్ష్మివై రావా !!అమ్మా !!
9. పసుపు, కుంకుమ, కాటుక, గాజులు పట్టువాస్త్రముల నిచ్చెదము
ఐదవతనము మాకు ఇవ్వగా సౌభాగ్యలక్ష్మీ రావే !!అమ్మా !!
10. వరాల నిచ్చే సిరుల తల్లీ శ్రీమాతా లక్ష్మీ నారాయణీ
బిరాన వచ్చి వారాల నీయవే శ్రీ వరలక్ష్మీదేవి !!అమ్మా !!
No comments:
Post a Comment