ఉదయాన నిద్ర లేవగానే మీ అరచేతిని , వేళ్ళను సందర్శించుకుంటూ, వాటిని కళ్ళకు అద్దుకొంటూ దిగువ మంత్రం పఠించండి.
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి !
కరమూలే స్థితే బ్రహ్మ ప్రభాతే కరదర్శనం !!
అంటే చేతి అగ్ర భాగంలో లక్ష్మీదేవి, చేతి మధ్య భాగంలో సరస్వతీదేవి, చేతి మూల భాగంలో బ్రహ్మ ఉంటారు కాబట్టి, అంత శక్తియుతమైన అరచేతిని ఉదయాన నిద్ర లేవగానే దర్శించి తీరాలి అని అర్థం.
మన చేతిలోనే ధన శక్తి, విధ్యా శక్తి, సృజనశక్తి ఉన్నాయన్న నమ్మకం మనలో ఉండాలి. అంత శక్తియుతమైన వాటిని కళ్ళకు అద్దుకొంటూ మంత్రం పఠించాలి.
No comments:
Post a Comment