Monday, 29 February 2016

ద్వాదశ రాశులకూ లక్ష్మీ మంత్రములు

 ఏ రాశివారు ఏ మంత్రాన్ని జపించాలో దిగువున ఇస్తున్నాం . ఆ మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుందని పూర్వుల వాక్కు వీటిని గురువుల ద్వారా గాని , పెద్దలద్వారా గాని ఉపదేశం పొంది జపించాలి.

1. మేషం                               ఓం ఐం క్లీం సౌః
2. వృషభం                             ఓం ఐం క్లీం శ్రీం
3. మిథునం                           ఓం క్లీం ఐం సౌః
4. కర్కాటకం                          ఓం ఐం క్లీం శ్రీం
5. సింహం                              ఓం హ్రీం శ్రీం సౌః
6. కన్య                                  ఓం శ్రీం ఐం సౌః
7. తుల                                 ఓం హ్రీం క్లీం శ్రీం
8. వృశ్చికం                            ఓం ఐం క్లీం సౌః
9. ధనుస్సు                           ఓం హ్రీం క్లీం సౌః
10. మకరం                              ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌః
11. కుంభం                               ఓం హ్రీం ఐం క్లీం శ్రీం
12. మీనం                                ఓం హ్రీం క్లీం సౌః

ఐం - మంచి విద్యకు, మాట కారితనమునకు.
క్లీం -  కోర్కెలు నెరవేరుటకు. సంపదలకు.
సౌః - ఇది సౌభాగ్యామునకు, ఆరోగ్యము, సకల కార్య విజయం పొందడానికి.
ఈ మూడు బీజములు సరస్వతీ, లక్షీ, పార్వతీ బీజములని అంటారు.
శ్రీం - అమ్మ వారికి చెందిన మంత్రం సంపదలకు, సకల అభీష్టసిద్ధి కలుగుటకు.
హ్రీం - సూర్యబీజము. వ్యాధులు నశించును.

మహా శక్తిగల ఈ మంత్రాలను మన మహర్షులు , అమోఘ తపశ్శక్తితో దేవతలను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.' ఓం, ఐం, క్లీం, హ్రీం, శ్రీం, సౌః
 అనే ఏకాక్షర బీజ మంత్రాలు శక్తివంతమైన మహామంత్రాలలవడానికి ఆయా దేవతల బీజాక్షరాలన్ని  కలిపి జపించాలి.

Sunday, 28 February 2016

శ్రీ మహాలక్ష్మీ మంత్రము

ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయై ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః

అనగా ఈ మంత్రమును జపించువారలకు దారిద్ర్యము తొలగి, రాజ్యలక్ష్మి, సౌభాగ్యాలక్ష్మి, అమృతలక్ష్మి, కామ్యలక్ష్మి, సత్యలక్ష్మి, భోగలక్ష్మి, యోగలక్ష్మి అను అష్టలక్ష్ములు వారి వశమగును. సర్వ సుఖములతో వర్ధిల్లుచుందురు.

ఒక లక్ష జపం చేసినచో మంత్రసిద్ధి యగును . ఈ మంత్ర జపం వల్ల సిరి సంపదలు లభించును. ఇంతేగాదు, ఈ మంత్రజపం వల్ల సమస్తమూ లభించుననీ , సర్వ శ్రేయస్సులకూ ఈ మంత్రజపం మూలామని శాస్త్రగ్రంథములు పెక్కు రీతుల ప్రశంసించుచున్నది.

Saturday, 27 February 2016

అష్టలక్ష్మికి ఆహ్వానం

అమ్మా శ్రీహరి రాణి , మా ఇంటికి రావే పూబొణి
ఇష్టముగా నిన్ను కొలుతుము తల్లీ అష్ట లక్ష్మివై రావమ్మా         !!అమ్మా !!
1. అందమైన సింహాసనము అమర్చి నీకై ఉంచితిమి
    ఆదరముతో మము బ్రోవగ రావే ఆదిలక్ష్మీ దేవీ                         !!అమ్మా !!
2. నవవిధంబుల పిండివంటలతో నైవేద్యంబులు చేసెదము
    దయతో మమ్ముకావగ రావే ధాన్యలక్ష్మీ  దేవీ                         !!అమ్మా !!
3. జాజీ , రోజా , మరువము , మల్లెలు నీ పూజకై తెచ్చితిమి
    ఇరుపార్శ్వంబుల గజములతోడ గజలక్ష్మీ నీవు రావే              !!అమ్మా !!
4. అంతటా నీవే ఉన్నావని నిన్నారాధించితినమ్మా
    అడుగడుగున  మాకభయమీయగా ధైర్యలక్ష్మీ రావే                  !!అమ్మా !! 
5. ఉల్లాసమ్ముతో ఉరకలు వేసే నూత్న దంపతులందరికీ 
    పిల్లాపాపల వారికీయగా సంతానలక్ష్మీ రావే                             !!అమ్మా !!
6. కర్మజీవులమైన మమ్ము కనికరమ్ముతో కాపాడి
    జయోస్తు! మీకని దీవెనలీయగ విజయలక్ష్మీ రావే                    !!అమ్మా !!                  
7. ఘుమఘుమలాడే అత్తరు పన్నీరు అమ్మా నీకై దాచితిమి 
ఘల్లుఘల్లుమని గజ్జెలు కదల ధనలక్ష్మీ నీవు రావే   !!అమ్మా !!
8. పర్తిపురీలో వెలసిన పరమ పావనుడు మన బాబా
పాపాలను ప్రక్షాళన చేయగ సాయిలక్ష్మివై రావా !!అమ్మా !!

9. పసుపు, కుంకుమ, కాటుక, గాజులు పట్టువాస్త్రముల నిచ్చెదము 
ఐదవతనము మాకు ఇవ్వగా సౌభాగ్యలక్ష్మీ రావే !!అమ్మా !!
10. వరాల నిచ్చే సిరుల తల్లీ శ్రీమాతా లక్ష్మీ నారాయణీ బిరాన వచ్చి వారాల నీయవే శ్రీ వరలక్ష్మీదేవి !!అమ్మా !!


Wednesday, 24 February 2016


లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి.

డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి.

“యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను.

“ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.


యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః 
అన్ని జీవులలోనూ బుద్ధిరూపంలో కొలువు ఉండే తల్లి లక్ష్మీ దేవికి (శుద్ధ ఙ్ఞాన ప్రతిపాదితమైన విద్యను ప్రసాదించే తల్లి విద్యాలక్ష్మీ) అనేకనేక నమస్కారాలు.


ఈ చరాచర జగత్తులోని అన్ని జీవులలో , బుద్ధిరూపంలో కొలువు ఉండే తల్లి లక్ష్మీ దేవి. ఆ తల్లినే విద్యా లక్ష్మి గా కొలుస్తాము. " విద్య " అనగానే మనకళ్ళముందు వాగ్దేవి సరస్వతి మాత ప్రత్యక్షం అవ్వడం అనేది సహజం. శుద్ధ ఙ్ఞాన ప్రతిపాదితమైన విద్యను ప్రసాదించే తల్లి సరస్వతి దేవి. ఆమే అనుగ్రహం ఉన్నవాళ్ళు మహావిద్వాంసూలుగా , ఙ్ఞానులుగా ప్రసిద్ధికెక్కుతారు.

విద్యాలక్ష్మీ అనుగ్రహం ఉన్నవారికి, విద్యా సంపదతో పాటు, ఐశ్వర్య సంపద కుడా కలుగుతుంది.

శ్రీ మహాలక్ష్మి దేవి సప్తమ అంశ అవతారమైన ఈ విద్యాలక్ష్మీని పూజించినవారు త్వరిత గతిన ఉన్నతస్థాయికి చేరుకుంటారు.

జన్మలన్నిటిలోను మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఎందుకంటే,జీవులలో మనిషికి మాత్రమే వివేకం, మంచి చెడులను గుర్తించే శక్తి, బుద్ధి కుశలతలను ఆ పరాశక్తి వరాలుగా అనుగ్రహించింది.

"విద్యలేనివాడు వింత పశువు" అని అంటారు. ఇలాగ విద్యావంతుడైన వ్యక్తిని అందరూ గౌరవించాలంటే ' వినయం' అనే లక్షణం చాలా ముఖ్యం.
"విద్యా వినయ సంపన్నే " అన్నారు పెద్దలు. వినయం లేని అహంకారి, ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ, ఎవరు గౌరవించరు.

శ్రీ విద్యాలక్ష్మి అనుగ్రహం ఉన్నవారికి వినయ సంపద కుడా అమ్మవారే వరముగా ఇస్తుంది .

విద్యా ప్రతిభ ,వినయం,మృదు సంభాషణ కలిగిన వారికి సమస్త సంపదలు అప్రయత్నముగ లభిస్తాయి.

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి శాంతి సమావృత హాసముఖే
నవ విధి దాయిని కలిమలహారిణి కామ్యఫలప్రద హాసయుతే
జయ జయహే మధుసూధన కామిని శ్రీ విద్యా లక్ష్మీ జయ పాలయమాం

ప్రభాత ప్ర్రార్ధన-కరదర్శన మంత్రం


ఉదయాన నిద్ర లేవగానే మీ అరచేతిని , వేళ్ళను సందర్శించుకుంటూ, వాటిని కళ్ళకు అద్దుకొంటూ దిగువ మంత్రం పఠించండి.
 కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి !
 కరమూలే స్థితే బ్రహ్మ ప్రభాతే కరదర్శనం !!

అంటే చేతి అగ్ర భాగంలో లక్ష్మీదేవి, చేతి మధ్య భాగంలో  సరస్వతీదేవి, చేతి మూల భాగంలో  బ్రహ్మ ఉంటారు కాబట్టి, అంత శక్తియుతమైన అరచేతిని ఉదయాన నిద్ర లేవగానే దర్శించి తీరాలి అని అర్థం.
మన చేతిలోనే ధన శక్తి, విధ్యా శక్తి, సృజనశక్తి ఉన్నాయన్న నమ్మకం మనలో ఉండాలి. అంత శక్తియుతమైన వాటిని కళ్ళకు అద్దుకొంటూ మంత్రం పఠించాలి.

కనక ధారాస్తోత్రము.............kanaka dhara stotram with telugu meaning

అజ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ 
వృక్షముకు ఆడుతుమ్మెదలు ఆభరణమైనట్లు, పులకాంకురముల కలిగిన విష్ణు హృదయమున ఆశ్రయించినదియు, సకల సంపదలకు ఆలవాలమైన  లక్ష్మీదేవి యొక్క క్రీగంటిచూపు నాకు శుభములు ప్రసాదించు గాక!

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః

పెద్దనల్లకలువపై 
వ్రాలిన ఆడు తుమ్మె దవలె శ్రీహరి చూపులు తన చూపులతో కలవగానే  ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాతయైన ఆ లక్ష్మీదేవి యొక్క ఒకింత చూపులను నాపై చూపి నాకు ఐశ్వర్యము  ప్రసాదించుగాక!

ఆ మీలితాక్ష మధిగమ్య  ముదా ముకుందం
ఆనందకంద మనిమేష మనజ్గ తంత్రం
అకేకర స్థిత కనీనిక పష్మనేత్రం
భూత్యై భవే నమ్మ భుజజ్గ శయాజ్గనాయాః

నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, రెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, రెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగునుగాక 

భాహ్యాంతరే మధుజిథ శ్రితికౌస్తుభే య
హరావలీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయః

భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయఅగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక 

కాలంబుదాలి లలితోరసి కైటభారే:
దారా ధరేసురటి యా తటిజ్గనేవ
మాతుస్సమస్త జగతాం మహనీయ మూర్తి:
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక
ప్రాప్తం పదం ప్రధమతఃఖలు యత్ప్రభావాత్
మాజ్గల్యభాజి మధుమాధిని మన్మధేన
మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః

ఏ క్రీగంటి ప్రభావమున మన్మథుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ది కన్య అగు లక్ష్మీదేవి యొక్క మండమగు నిరేక్షము నాయందు ప్రసరించుగాక 

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
మిందీవరోదర సహోదర మిందిరాయాః

సమస్త దేవేంద్ర పదవినీయగలదియు, విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము నాపై నిలిచియుండునుగాక!
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః

పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్థ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక 

దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః

శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః

వాగ్దేవత (సరస్వతి) అనియు, గరుఢధ్వజ సుందరి అనియు, శాకం బరియనియు, శశిశేఖర వలభాయనియు పేరు పొందినదియు, సృష్టిస్థితిలయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషియగు లక్ష్మీదేవికి నమస్కారము.

ఆ మీలితాక్ష మధిగమ్య  ముదా ముకుందం
ఆనందకంద మనిమేష మనజ్గ తంత్రం
అకేకర స్థిత కనీనిక పష్మనేత్రం
భూత్యై భవే నమ్మ భుజజ్గ శయాజ్గనాయాః

నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, రెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, రెప్పలునుగలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగునుగాక 

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై

పుణ్య కార్యముల ఫలమునొసగు శ్రుతిరూపిణియు, సౌందర్యగుణ సము ద్రయగు రతిరూపిణియును, పద్మనివాసియగు శక్తిరూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

పద్మమును పోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని-అమృతమునకును తోబుట్టువును, నారాయణుని వల్లభయునగు లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై

బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయికయైనదియును, దేవతలలోదయమే ముఖ్యముగా గలదియును, విష్ణువుకు ప్రియురాలునుయైన లక్ష్మీదేవికి నమస్కారము.
నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై

భృగుమహర్షి పుత్రికయును, విష్ణు వక్ష:స్థలవాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై

తామరపువ్వులవంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలునగు లక్ష్మీదేవికి నమస్కా రము.

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే

పద్మములవంటి కన్నులగల పూజ్యురాలవగు నోయమ్మా! నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదలు కలగించునవి, చక్రవర్తిత్వము నొసగగలవి, పాపములను నశింపచేయునవి. ఓ తల్లి అవి ఎల్లప్పుడును నన్ను అనుగ్రహించుగాక!

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే

ఏదేవియొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్థ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరియగు లక్ష్మీదేవిని... నిన్ను మనో వాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును.

సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం

కమలముల వంటి కన్నులు గల ఓ తల్లి చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ! విష్ణుప్రియా!, మనోజ్ఞులారా!, ముల్లోకములకు సంపదను ప్రసాదించు మాతా! నన్ననుగ్రహింపుము.

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం

దిగ్గజములు కనకపు కుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించ బడిన శరీరము గలదియు, లోకములకు జననియు, విశ్వ్రపభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియునగు లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను.

కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః

శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి! దరిద్రులలో ప్రథమస్థానంలో ఉన్నాను. నీ దయకు తగిన పాత్రమును అగునన్ను నీ కరుణా కటాక్షముతో చూడుము.

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః

ఎవరీ స్తోతములచే ప్రతిదినమును వేద రూపిణియు, త్రిలోక మాతమునగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నారు.

సువర్ణ ధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్
ఆదిశంకరాచార్యులు రచించిన కనక ధారాస్తోత్రమును ప్రతిదినము త్రికాలమందు పఠించువారు కుబేరునితో సమానులగును.

- See more at: http://www.teluguone.com/devotional/content/%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%B%E0%B0%95%E0%B0%9F%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%82-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%81%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81---88-26496.html#sthash.zn1kseY2.dpuf

శ్రీ సూక్తం ........srisuktam with telugu meaning

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా ద ప్రబోధినీమ్
శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్

కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్దాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహాం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

ఆదిత్యవర్ణే తపసో ధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వ:
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ:

ఉపెతు మాం దేవసఖ: కీర్తిశ్చ మణినా సహా
ప్రాదుర్భూతో స్మిరాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదుమే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠా మలక్షీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్

గందద్వారాం దురాదర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్మ్ సర్వ భూతానాం తామిహోపహ్వయే శ్రియమ్

మనస: కామకూతిం వాచ: సత్యమశీమహి
పశూనాం రూపమన్యస్య మయి శ్రీ:శ్రయతాం యశ:

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్

ఆప: సృజంతు స్నిగ్దాని చిక్లీత వసమే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగలాం పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ


ఆర్ద్రాం య: కరిణీం యష్టిం సువర్ణామ్ హేమ మాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమన పగామినీమ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్, విందేయం పురుషానహమ్

య: శుచి: ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్
శ్రియ: పంచదర్చం చ శ్రీకామ: సతతం జపేత్

ఆనన్ద: కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా:
షయస్తే త్రయ: పుత్రా: స్వయం శ్రీరేవ దేవతా

పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్

అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే

పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్
ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మామ్

చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్
చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ హహాలక్ష్మీ ముపాస్మహే

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు:
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహ
సోమం ధనస్య సోమినో మహ్యాం దదాతు సోమినీ

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతి:
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా

వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుత:
రోహంతు సర్వభీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరా వర్తనాభి: స్తనభర నమితా శుభ్ర వస్తోత్తరీయా

లక్ష్మీర్థివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభై:
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా

లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా

వరాంకుశౌ పాశమభీతిముద్రాం
కరైర్వహంతీం కమలాసనస్థామ్                            

బాలర్కకోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తామ్
సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్
శ్రీ ర్వర్చ స్వ మాయి ష్ మారో గ్యమావీ దాత్ పవమానం మహీయతే
దాన్యం దనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు:



ఓం శాంతి: శాంతి: శాంతి:

ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. ఎవరి కరుణ, కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము. గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను. తల్లీ నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము. చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను. చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను. ఓ దేవీ! నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం పోయేలా కరుణించు. సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లి! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక! కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు! ఆకలి దప్పికలతో కృశించినది, శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని (అలక్ష్మి) నేను నాశనం చేస్తాను. నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు. సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్లప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను. ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము. కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన, సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి. మహాలక్ష్మి పుత్రుడవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి. దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు. ఓ అగ్నిదేవ! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము. ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి. సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత. పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు. గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు. పుత్రులు, గోవులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన సకల సంపదలు ప్రసాదించు. జనులకు నువ్వు తల్లిగా భాసిస్తున్నావు. నన్ను ఆయుష్మంతునిగా చేయుము. అగ్ని, వాయువు, సూర్యుడు, అష్టవసువులు, దేవేంద్రుడు, బృహస్పతి, వరుణుడు - తమ తమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు. చంద్రునివలె చల్లగా, దేవతల శక్తిగా, సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తున్నది, శ్రీదేవి, ఈశ్వరి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని - మువ్వురినీ తన మహత్తుగా కలదీ అయిన శ్రీమహాలక్ష్మిని కొలుస్తున్నాను. ఓ గరుత్మంతుడా! సోమరసం కోసం వచ్చిన వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు సోమరసం గ్రోలనీ. సోమయాగం నిర్వర్తించాలని సంకల్పించిన నాకు పుష్కలముగా ధనాన్ని ప్రసాదించనీ! పుణ్యము చేసిన భక్తులకు కోపము రాదు, మాత్సర్యము ఉండదు, లోభము నశిస్తుంది, దుర్బుద్ధి పుట్టదు. భక్తిని పొంద కోరేవారు శ్రీ సూక్తాన్ని సదా జపము చెయ్యాలి. నీ కృపతో మేఘాలు ఎల్లప్పుడూ వర్షించనీ! విత్తనాలు చక్కగా మొలకెత్తి బాగా పెరగనీ! భగవంతుని నిందించేవారు నిష్క్రమించు గాక! పద్మము అంటే ఇష్టపడేదానా! పద్మములు చేతిలో ధరించిన జగన్మాతా! పద్మములో జన్మించి, నివసించే తల్లీ! తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలిగి, విష్ణువు మనస్సుకు అనుకూలమైన మాతా! నీ పాదపద్మములతో నన్ను అనుగ్రహించు. పద్మము మీద ఆసీనురాలై ఉన్నదేవరో, విస్తారమైన పిరుదులు కలిగిన, తామర రేకులవంటి నేత్రములు కలవారెవరో, లోతైన నాభి కలిగి, స్తన భారముతో వంగి ఉన్న వారెవరో, స్వచ్చమైన వస్త్రాలు, ఉత్తరీయము ధరించిన దెవరో, రత్నాలు పొదిగిన కలశాల జలంతో దేవలోకములోని అత్యుత్తమైన గజములతో అభిషేకించ బడుతున్న దెవరో, పద్మాన్ని చేత ధరించిన దెవరో, సర్వ మంగళ స్వరూపిణియైన దెవరో అట్టి మహాలక్ష్మి నా గృహములో సదా సర్వవేళలా నివసించుగాక! భాగ్యానికి నిలయమనది, పాలకడలి నుండి ఉద్భవించినది, శ్రీరంగములో వెలసిన దేవీ, దేవ లోక స్త్రీల నందరిని దాసీజనంగా చేసుకొన్నది, లోకాని దీపంగా భాసిస్తున్నది, ఎవరి మృదుల కటాక్షంతో ఇంద్రుడు, శివుడు వైభవము పొందుతున్నారో, మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణువుకు ప్రియమైనది అయిన నీకు నమస్కరిస్తున్నాను. సిద్ధులను ఇచ్చే, ముక్తిని అనుగ్రహించే, విజయాన్ని సిద్ధింప చేసే లక్ష్మీ రూపాలలో, సరస్వతిగాను, సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలిచ్చే వరలక్ష్మిగా నువ్వు సదా నాకు ప్రసన్నురాలవుగా ఉండుగాక! వర, అభయ ముద్రలు చేత దాల్చిన, పాశము, అంకుశములు చేత ధరించిన, పద్మములో నివసిస్తున్న, కోటి బాల సూర్యుల ప్రకాశము కలదీ, మూడు నేత్రములు కలదీ, ఆదిశక్తి, జగదీశ్వరి అయిన ఆమెను నేను స్తుతిస్తాను. శుభములలో శుభానివి, సకల శుభాలను సాధించి, ప్రసాదించే దానవు, శరణు పొందటానికి యుక్తమైన దానవు, మూడు కన్నులు కాలిగిన ఓ దేవీ, నారాయణీ! నా నమస్కారము. పద్మ వాసిని, పద్మమును చేత ధరించినది, పవిత్రమైన తెల్లని వస్త్రములు, సుగంధభరితమైన మాలను ధరించి శోభిస్తున్న, భగవతి, హరిపత్ని, కామ్యదాయిని, ముల్లోకాలను పోషించి కాపాడే నువ్వు నన్ను అనుగ్రహించు. విష్ణుపతిని, భూదేవి, తులసి గా అలరారుతున్నది, మాధవుని ప్రియురాలు, ప్రియసఖి, విష్ణువుతో కూడిన దేవీ! నేను నమస్కరిస్తున్నాను. మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక! మహాలక్ష్మీ! వర్చస్సు, లోటు లేని జీవితం, మంచి ఆరోగ్యం - నాకు ప్రసాదించే పవనాలు సదా వీచనీ. ధన ధాన్యాలు, పశు సంపద, పుత్రులు, నూరేళ్ళ దీర్ఘాయుష్షు నాకు చేకూరనీ. ఋణము, రోగము, దారిద్ర్యము, ఆకలి, అకాల మరణము, భయము, శోకము, మానసిక వ్యథలు నశించు గాక!. శ్రీదేవి చేరే వారిని ఐశ్వర్యం వరిస్తుంది; సంపద, దీర్ఘాయుష్షు చేకూరుతుంది. వారు ఐశ్వర్యాలతో తులతూగుతూ మరణం లేని స్థితికి చేరుకుంటారు. సత్వరమే వారు కీర్తిని, విజయాన్ని పొందుతారు. మంచివి అన్నీ లక్ష్మే దేవియే - ఇలా తెలుసుకున్న వాడు లక్ష్మీ దేవిని చేరుకుంటాడు. మంత్రయుక్తముగా ఎల్లప్పుడూ యాగము చేయాలి. అలా చేసే వాడికి పుత్ర సంపద, పశు సంపద లభిస్తుందని గ్రహించాలి.