Wednesday, 16 March 2016

ఓం' : 
సమస్త మంత్రాలసారంగా `ఓం'కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన `ఓం' కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది. అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం `ఓం'కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజః సత్త్వ, తమో గుణాలకు ప్రాతినధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు. వేదం ఓంకారరూపం, వేదరాశి, ఋగ్వేదం నుండి `అ' కారం, యజుర్వేదం నుండి `ఉ' కారం, సామవేదం నుండి `మ' కారం పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.

శ్రీం: 
అమ్మ వారికి చెందిన మంత్రం ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.

హూం: 
సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దైవికక్రోధం యొక్క శబ్దం `హూం'. ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.

రాం: 
ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.

ఐం: 
జ్ఞాన బీజం. ఏకాగ్రత, శక్తులను ప్రసాదిస్తుంది.

మాం: 
మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.

సోహం: 
ఊపిరి యొక్క స్వాభావిక బీజం. `సో' ఉచ్ఛా్యసం, `హం' నిశ్శా్వసం. సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం. `సో' శక్తి `హం' శివుడు.

ఏకాక్షర మంత్రం - `ఓం' 
అన్ని మంత్రాలలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం `ఓం'. దీనినే `ప్రణవం' అని కూడా అంటారు. మంత్రోచ్ఛారణ జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన. ఉదా బిడ్డ తన తల్లిని `అమ్మా' అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకొని వచ్చి, ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవతా మూర్తులు, మంత్రోచ్ఛారణతో మనం మననం చేయగానే మన పట్ల ‚‚ప్రసన్నలవుతున్నారు.
మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. `ఐం, శ్రీం, హ్రీం, క్లీం' అనే ఏకాక్షర బీజ మంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి. ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం.

No comments:

Post a Comment