Wednesday, 16 March 2016

మహాలక్ష్మి మంగళహారతి పాటలు

సాయంకాల సమయములో సంధ్య దీపారాదనలో
వచ్చెను తల్లి మహాలక్ష్మి,  వచ్చెను తల్లి వరలక్ష్మి
 
మేడలో హారం వేసుకొని కాళ్ళకు గజ్జెలు కట్టుకొని
ఘల్లు ఘల్లు మని వచ్చింది కిల కిల కిల నవ్వింది
అడిగినంత ఇచ్చింది    ''సాయంకాల''
 
అందరు కలసి రారండి, పూజలు బాగుగా చేయండి 
రకరకాల గాజులు తెండి-ముతైదువులకు పంచండి   ''సాయం''
 
వజ్ర కీరిటం చుడండి, ముత్యాల హారం చుడండి
నాగాభరణం చుడండి, దేవి రూపం కనరండి      ''సాయం''
 
ఆర్తిని బాపు ఆదిలక్ష్మి - ధాన్యమునిచ్చును ధాన్యలక్ష్మి 
ధైర్యమునిచ్చును ధైర్యలక్ష్మి - శుభాములనిచ్చును గజలక్ష్మి 
వరములనిచ్చును వరలక్ష్మి-సంతానమొసగే సంతానలక్ష్మి
విజయమునిచ్చును విజయలక్ష్మి -విద్యనోసగే విద్యాలక్ష్మి 
ధనములనిచ్చును ధనలక్ష్మి
 
అందరు కలసి రారండి - రకరకాల పూవులు తెండి
దేవికి అర్చన చేయండి - దేవి రూపం కనరండి    ''సాయం''

No comments:

Post a Comment