Tuesday, 8 March 2016

మంగళ హారతి

లక్ష్మీదేవ్మ- మంగళ హారతి ఇది గో
అనురాగంబులో- నిన్నువేడి తిని
క్షీర సాగర తనయా - ఆది లక్ష్మీ ప్రార్ధంచితిని || లక్ష్మీ
వనస బత్తాయా - దానిమ్మ ఖర్జూర
తేనెలూ రేటి - తీ పైన పండ్లు
కన్నతల్లి - కమలాఫలాలు
ఉంచినాఫమ్మ- దయాసేయవమ్మా || లక్ష్మీ 
మల్లె పుష్పాలు - మందార పూలు
తెల్ల గన్నేరు - చెంగల్ప పూలు
పళ్ళేరములో- మధుపాయసాలు
తల్లి ఉన్నాయి - దయ సేయమ్మా || లక్ష్మీ  
భక్తితో గొలిచేటి - నీ భక్త వరులం
నిజముగా - నిన్ను నమ్మేము నిరంతరం
శ్రీ హరి ప్రియమమ్ము కాపాడుమమ్మా
సకల సౌఖ్యాలు - చేకూర్చు మాతా || లక్ష్మీ

అష్టలక్ష్మీ రూపాలివే...

1. సంతాన లక్ష్మి 2.ఆదిలక్ష్మి 3.గజలక్ష్మి 4.ధనలక్ష్మి 5.ధాన్యలక్షి, 6.విజయలక్ష్మి 7.ఐశ్వర్యలక్ష్మి 8.వీరలక్ష్మిలతో పాటుగా శ్రీమన్నారాయణుడు ఇక్కడ కొలువుతీరారు.

సంతాన లక్ష్మీ ప్రార్థన
శ్లో దరహసిత మనోజ్ఙాన్‌ కర్దమానంద ముఖ్యాన్‌
కరధృత విజ హస్తాన్‌ లాలయన్తీ స్వపుత్రావ్‌ః
వితరతు పరితుష్టా స్మాసు సంతాన లక్ష్మీః
మహిత సుగుణ భవ్యాం. సంతతిం సంతతేర్నః
భావం:- చిరునవ్వుతో ముచ్చట గలిగించు కర్దముడు, ఆనందుడు, చిక్తీతుడు అను తన కుమారులను ప్రేమతో ఎత్తుకొని లాలించుచూ ఆనందించు నట్టి సంతాన లక్ష్మి గుణ శ్రేష్ఠులైన మంచి సంతానమును మాకు ప్రసాదించుగాక.

ఆదిలక్ష్మీ స్తుతి
శ్లో కరయుగ ధృత పద్మా పద్మ మాలాభిరామా
శ్రీతజన నిధిరేషా సర్వ లోకైక మాతా 
కమల నయన వక్షఃపీఠ మాతస్ధుషీనః
ప్రదిశతు పురషార్థా నాది లక్ష్మీ రభీష్టాన్‌ః
భావం:- హస్తముల యందు పద్మములను, కంఠమున పద్మమాలను ధరించి ప్రకాశించునదియూ, ఆశ్రయించిన భక్తుల కోరికలను తీర్చుటలో విధి వంటిదియూ, సర్వ జగత్తుకూ ఏకైక మాతయూ, పుడరీకాక్షుని వక్ష స్థలము నిత్య నివాసముగా గలదియునగు ఆదిలక్ష్మీ ధర్మార్థ కామ మోక్షాది సకల పురుషార్థములను, సర్వాభీష్టములను దయతో మాకు అనుగ్రహించుగాక.

గజలక్ష్మీ ప్రార్థన
godశ్లో జలజ మధి వసన్తీ మత్త వేదండ శుండో 
ధృతి జల కణికాభి స్పిచ్చ మానా నితాన్తమ్‌ః
నత జన దురవస్థా ధంసనీయమ గజాన్తాం
ప్రదిశతు గజలక్ష్మీ స్పంపదం న స్పమృద్దామ్‌ః
భావం:- పద్మమున కూర్చున్నదియూ, రెండు వైపులా మదపుటేనుగులు తొండములతో నీరు గ్రహించి చేయు అభిషేకమును స్వీకరించుచున్నదియ, ఆశ్రయించిన భక్తుల దురవస్థలను నశింపజేయునట్టిదియూ అయిన గజలక్ష్మీ గజములను (ఏనుగులను) పోషింప గల సమృద్ధమైన సంపదను ఇచ్చి కాపాడుగాక.

ధనలక్ష్మీ ప్రార్థన
శ్లో ధనపతి ముఖదేవై స్తూయమానా దయార్ధ్రా
దినకర విభవర్లా బిల్వ వృక్షాలయా శ్రీః
ధృత నవవిధి హస్తా దేవతా మంగళానాం
వితరతు ధనలక్ష్మీ విత్త రాశీన్‌ పదా నః
భావము:- మహా ధనాధిపతియైన కుబేరుడు, మున్నగు దేవతలచే స్తుతింపబడుచున్న దయా స్వరూపిణీయూ, సూర్యుని కాంతితో సమనమైన శరీరచ్ఛాయ కలదియూ, మారేడు వృక్షము నివా సముగా గలదియూ ‘మంగళం మంగళానాం’ అనురీతిగా శుభ ములను సాధించునట్టి దేవతయు, అయిన ధనలక్ష్మీ మాకెల్లప్పుడూ సమృద్ధమైన సంపదల నిచ్చి కాపాడుగాక.

ధాన్యలక్ష్మీ ప్రార్థన
god1శ్లో అభయ వరద ముద్రా సధృక్త శోకా
కరకమల విరాజ ఛ్చాలి మంజర్యుదారాః
ప్రతికల మిహ దత్తాం సర్వ సస్యోపయాతాం
అతులిత బహుధాన్యాం సంపదం ధాన్యలక్ష్మీః
భావం:- ఒక చేయి అభయమునూ, మరియొక చేయి వరములనూ ప్రసాదించునట్లు హస్త ముద్రలను ధరించి భక్తుల దుఃఖమును తొలగించునదియూ కరద్వయమున ధాన్యపు కంకులను ధరించినదియూ అగు ధాన్యలక్ష్మీ సకలములైన సస్యములను ఫలింపజేసి సకలవిధ ధాన్యసమృద్ధి, ధనసమృద్ధి కలుగునట్లు అనుగ్రహించుగాక.

విజయలక్ష్మీ ప్రార్థన
శ్లో శుభమణిగల చారు స్వర్ణ సింహాసనస్ధా
సురనర వనితాభి స్పాదరం సేవ్యమానాః
సకల శుభ విధాత్రీ సర్వలోనేశ్వరీయం
దిశతు విజయలక్ష్మీ ర్విష్ణుపత్నీ జయం నః
భావం:- మణులచే పొదగబడిన, మిక్కిలి సుందరమైన స్వర్ణ సింహాసనము నధిష్టించి దేవతా స్ర్తీలచే అదర పూర్వకముగా సేవింప బడుచున్నదియూ, భక్తులకు సకల శుభము లను ప్రసాదించునదియు. శ్రీ మహా విష్ణువున కు పత్నియై సకల లోకములను శాసించున దయు అయిన విజయలక్ష్మీ అన్ని కార్యములం దును మనకు విజయమును కలుగ జేయుగాక. 

ఐశ్వర్యలక్ష్మీ ప్రార్థన
laxmiశ్లో రుచిర కనక భూషా భూషితా స్వర్ణవర్ణా 
శ్రీత నయన చకోరా నంద దాస్సేందు బింబాః
కలశ జలధి కన్యా సేయమైశ్వర్య లక్ష్మీః
నిరవధిక విభూతిర్న:ప్రదద్వాది హో ష్టౌః
భావం:- మనోజ్ఙమైన (కన్నులకు ఆనందము కలిగించు) బంగారు ఆభరణము లెన్నిటినో ధరించి సువర్ణ ఛ్చాయతో నొప్పు శరీరము గలదియు చక్రవాక పక్షులకు చంద్రబింబము ఆనందము కల్గించునట్లు ఆశ్రీతులకు ఆనందము కలిగించు ముఖ సౌందర్యము గలదియు పాల సముద్రము నుండి అవతరించి నదియు అయిన ఐశ్వర్యలక్ష్మీ అణియు మున్నగు నిరవధికములైన అష్టైశ్వర్యములను మనకు ప్రసాదించి కాపాడుగాక. 

వీరలక్ష్మీ ప్రార్థన
శ్లో గజవర మధిరూఢా శంఖ చక్రాల సిశార్ధా
ద్యమిత నిశిత శస్త్రాస్త్రోద్భటా శాత్రవేషు:
సుమధుర దరహోసేనాశ్రీఆన్‌ హర్షయన్తీ రిపునివహ నిరాసం వీరలక్ష్మీ ర్విధత్తామ్‌:
భావం:- మదపుటేనుగు నధిరోహించి శంఖము, చక్రము, ఖడ్గము, విల్లు మున్నగు ప్రభావ భాసురములైన ఆయుధములను ధరించి శతృవులపై ఆగ్రహమును చూపుచూ వారిని వణికించునదియూ అదే సమయమున భక్తులను చిరునవ్వులతో ఆనందించేయు నట్టిదయూ అయిన వీరలక్ష్మీ శతృవినాశమును గావించి భక్తులను కాపాడుగాక.

లక్ష్మీరావో మాయింటికి లాలితముగా వేడుకొందుము


Sunday, 6 March 2016

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని

1)క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
2) అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
3) చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
4) పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం

శ్రీ మహాలక్ష్మీ పాట

శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది.....సౌభాగ్య శోభల వరము తెచ్చింది....

కొంగుబంగరు తల్లి కోరి వచ్చింది....మంగళారతులెత్తి ఎదురేగరండి


జనులారాలెండి నిదురించకండి...శుక్రవారపు సిరిని సేవించరండి

సిద్ధి బుద్ధూలనొసగు భారతీ మూర్తీ....శక్తి యుక్తుల నొసగు పార్వతీ మూర్తీ.


అష్ఠ సంపదలనోసగు శ్రీ సతీ మూర్తీ.....ముమ్ముర్తులకు మూలమీదివ్య
 దీప్తి 

కళ లేని కన్నులకు కనిపించదండీ...కలత ఎరుగని సతుల కరుణించునండీ
ముత్తైదువుల పసుపుకుంకుమల సాక్షీ...పారాణి పాదాల అందియల సాక్షీ
పచ్చతోరణ మున్నా ప్రతి ఇల్లు సాక్షి......నిత్యమంగళమిచ్చు నత్తిల్లే సాక్షి
అటువంటి ఇల్లే కోవెలగ యెంచి.....కొలువుండు ఆ ఆకలిమి కాణాచి వచ్చి 

భాగ్యపు లక్ష్మీ రావమ్మ

శ్రీ పురందర దాసు గారి కీర్తన
భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ (ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ) భాగ్యపు లక్ష్మీ రావమ్మ మాయమ్మ నూ
సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ (ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ) సౌభాగ్యపు లక్ష్మీ రావమ్మ
హెజ్జెయ మేలె హెజ్జెయనిక్కుత (ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯನಿಕ್ಕುತ) హజ్జ పైనొక హజ్జ వేస్తు 
గెజ్జె కాల్గళ ధ్వనియ తోరుత (ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ) గజ్జెల కాళ్ల ధ్వని వినిపిస్తు
సజ్జన సాధు పూజెయ వేళెగె (ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ) సజ్జన సాధు పూజల వేళకి
మజ్జిగెయొళగిన బెణ్ణెయంతె (ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ) మజ్జిగ లోపల వెన్నలాగ
కనకవృష్టియ కరెయుత బారె (ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ ಬಾರೆ) కనకవృష్టిని పిలుస్తు రావె
మనకె మానవ సిద్ధియ తోరె (ಮನಕೆ ಮಾನವ ಸಿದ್ಧಿಯ ತೋರೆ) మనసుకు మానము సిద్ధింప రావె
దినకర కోటి తేజది హొళెయువ (ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ) దినకర కోటి తేజమున మెఱయు
జనకరాయన కుమారి బేగ (ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ) జనకరాయుని కుమారి బేగ
అత్తిత్తగలదె భక్తర మనెయలి (ಅತ್ತಿತ್ತಲಗದೆ ಭಕ್ತರ ಮನೆಯಲಿ) ప్రక్కకు తొలగక భక్తుల యింటన
నిత్య మహోత్సవ నిత్య సుమంగలి (ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಲಿ) నిత్య మహోత్సవ నిత్య సుమంగళి
సత్యవ తోరువ సాధు సజ్జనర (ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ) సత్యముఁ జూపగ సాదు సజ్జనుల
చిత్తది హొళెయువ పుత్థళి బొంబె (ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ) చిత్తనఁ మెఱయుచు పుత్థడి బొమ్మ
సంఖ్యెయిల్లద భాగ్యవ కొట్టు (ಸಂಖ್ಯೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು) సంఖ్యలేని భాగ్యమునిచ్చెడి
కంకణ కైయ తిరువుత బారె (ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ) కంకణము జేతఁ దిప్పుతు రావె
కుంకుమాంకిత పంకజలోచనె (ಕುಂಕುಮಾಂಕಿತ ಪಂಕಜಲೋಚನೆ) కుంకుమాంకిత పంకజలోచన
వెంకటరమణన బింకద రాణి (ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ) వేంకటకమణుని బింకపు రాణి
సక్కరె తుప్పద కాలువె హరిసి (ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ) చక్కెర నేతుల కాలువ పాఱగ 
శుక్రవారద పూజెయ వేళెగె (ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ) శుక్రవారపు పూజల వేళకు
అక్కరెవుళ్ళ అళగిరి రంగన (ಅಕ್ಕರೆವುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ) అక్కర యున్న అళగిరి రంగడు
చొక్క పురందర విఠ్ఠలన రాణి (ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠ್ಠಲನ ರಾಣಿ) చక్క పురందర విఠ్ఠలుని రాణి

మంగళగౌరికి శ్రీమతులు ఇవ్వరే

మంగళగౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు (2)
అయిదు ప్రాణములు అయిదవతనమే (2)
పసుపు కుంకుమ పడతికే సిరులే (మంగళ)
సిగలో పూవులు నగ అంటి కమల కాటుకే కళలంట (2)
చేతికి గాజులు విలువంట నొసటి కుంకుమే బ్రతుకంట
పతినెడబాయని సతులుంటే
పచ్చని తల్లులు పార్వతులే (2)
పతి సన్నిధిలో కన్నుమూసిన ఆరని కుంకుమ హారతులే
ఆరని కుంకుమ హారతులే (మంగళ)
ఇల్ల్లు ఉన్నది గృహలక్ష్మి తల్లి అయినది సంతాన లక్ష్మి
మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి (మంగళ)